కమర్షియల్ ట్యాక్స్ శాఖ, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలి – జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకమర్షియల్ ట్యాక్స్ శాఖ ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహణ

జిల్లా కలెక్టర్  క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం కమర్షియల్ ట్యాక్స్ శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్  ఏ తమీమ్ అన్సారియా  అధ్యక్షత వహించడం జరిగింది ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపొందించేందుకు చర్యల పై  చర్చించారు.
జిల్లా కలెక్టర్  తమీమ్ అన్సారియా  క్రింది అంశాలపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు… అందులో..
పన్ను పరిధిని విస్తరించడం: రూ.40 లక్షల టర్నోవర్ (వస్తువుల విషయంలో) మరియు రూ.20 లక్షల టర్నోవర్ (సేవల విషయంలో) దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. అటువంటి వ్యాపార సంస్థల సమాచారం కమర్షియల్ ట్యాక్స్ శాఖకు అందించాల్సిందిగా సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

– పాత బకాయిల వసూలు: మునిసిపల్ కమిషనర్లు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులు, పన్ను బకాయిదారుల ఆస్తుల వివరాలను కమర్షియల్ ట్యాక్స్ శాఖకు అందించాలని సూచించారు. అలాగే, పన్ను ఎగవేతదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

– టి. డి ఎస్  మినహాయింపు మరియు ప్రభుత్వానికి చెల్లింపు:


రూ.2.5 లక్షల విలువను మించిన సరఫరా ఒప్పందాలపై టి. డి. ఎస్  మినహాయించి జి ఎస్ టి ఆర్ -7 ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా సూచించారు. జిల్లా లోని డ్రాయింగ్ లను డిస్బర్స్మెంట్  అధికారులతో  టి. డి. ఎస్  పై అవగాహన సమావేశం నిర్వహించాలని సూచించారు.

–  పన్ను లేకుండా సరుకుల రవాణా:

– గ్రానైట్ మరియు ఇతర సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రవాణా మరియు మైనింగ్ శాఖలు కమర్షియల్ ట్యాక్స్ శాఖతో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు.

– డీజిల్ స్థానికంగా కొనుగోలు: కాంట్రాక్టర్లు డీజిల్ ను  స్థానికంగా ప్రామాణిక షెడ్యూల్ రేట్ల ప్రకారం కొనుగోలు చేయాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పన్ను ఆదాయం కాపాడబడుతుందని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని కోరారు.

– ప్రొఫెషన్ ట్యాక్స్: రూ. 10 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు, డాక్టర్లు, ఆర్కిటెక్టులు వంటి ప్రొఫెషనల్స్ ప్రొఫెషన్ ట్యాక్స్ చెల్లించాల్సిందిగా సూచించారు. అలాగే, నెలకు రూ. 15,000/- కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులు కూడా ప్రొఫెషన్ ట్యాక్స్ చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థల సమాచారం కమర్షియల్ ట్యాక్స్ శాఖకు అందించాల్సిందిగా సూచించారు.

ఈ సమావేశంలో  వై. కిరణ్ కుమార్, జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్,  ఎం. సత్య ప్రకాష్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ మరియు ఓంగోలు-I, ఓంగోలు-11 సర్కిళ్ల అసిస్టెంట్ కమిషనర్లు,  డిడి మైన్స్ రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, డిటిసి  సుశీల, సి పి డి సి ఎల్, ఇరిగేషన్ శాఖల ఎస్ ఈ లు వెంకటేశ్వర రావు, వరలక్ష్మి, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి  పద్మశ్రీ, వ్యవసాయ శాఖ జేడి  శ్రీనివాస్ రావు తదితరులు  హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *