జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు- జిల్లాలో 1114.8 మి.మీల వర్షపాతం నమోదు – జిల్లా నరానరి వర్షపాతం 28.6 మి.మీలు….

బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన జిల్లాలో ఖరీఫ్లో సాగయిన పంటలు ఊపిరి పీల్చుకున్నాయి. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం 8 గంటల వరకు జిల్లాఓ 1114.8 మి.మీలు, జిల్లా నరాసరి 28.6 మి.మీల వర్షపాతం నమోదు అయినది. బుధవారం ఉ దయం నుండి కూడ రాత్రి వరకు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాలలో ప్రధాన వాగులు పొంగి పొర్లు తున్నాయి. వాగుల వద్ద పోలీసులు సైతం రక్షణను ఏర్పాటు చేసారు.. అందులో అత్యధికంగా మద్దిపాడు మండలంలో 198.4 మి.మీలు నమోదు కాగా, కొమరోలు మండలంలో అత్యల్పంగా 4.0 మి.మీలు నమోదు అయ్యాయి. జిల్లాలో మండలాల వారిగా వర్షపాతం నమోదు ఇలా ఉన్నది. మద్దిపాడు 198.4 మి.మీలు, నాగులుప్పల పాడు 130.4, కొత్త పట్నం 100.6, ఒంగోలు రూరల్, ఒంగోలు అర్బన్ లలో 62.2, దర్శి 61.6, నంత నూతల పాడు 46.8, కురిచేడు, చీమకుర్తిలలో 41.4, తాళ్లూరు 30.0, మర్రిపూడి, హనుమంతుని పాడు 21.8, పుల్లల చెరువు 21.0, త్రిపురాంతకం 20.6, పొదిలి 16.8, యర్రగొండ పాలెం 16.4, కొండపి 14.2, టంగుటూరు 14.2, శింగరాయ కొండ 13.8, దొనకొండ 13.4, అర్ధవీడు 13.2, పెద్దార వీడు 12.8, కొనకన మిట్ట, బేస్త వారి పేట, చంద్రశేఖర పురం (సీ ఎన్ పురం)లలో 12.6 మి.మీల చొప్పున, మార్కాపురం 12.2, కంభం 11.8, జరుగు మల్లి 10.4, తర్లు పాడు 8.6, ముండ్లమూరు 8.4, కనిగరి 8.0, పామూరు 6.8, పొన్నలూరు 6.6, వెలిగండ్ల 6.0, రాచర్ల 5.4, దోర్నాల, పెద చెర్లో పల్లి (పీ సీ పల్లి) లలో 4.6 మి.మీల చొప్పున, గిద్దలూరులో 4.0, కొమరోలులో 4.0 మి.మీల చొప్పున నమోదు అయినది. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో మరింత వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులు ప్రస్తుతం వేసిన పంటలను కాపాడుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (జెడీఏ) శ్రీనివాస రావు కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_8388610

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *