దివంగత దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి జయంతి వేడుకలు వైసీపి శ్రేణులు,బూచేపల్లి అభిమానులు మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైసీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి ఆధ్వర్యంలో తేజ వయో వృద్ధాశ్రమంలో ఆయనకు నివాళులు అర్పించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేసారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కేక్కు కట్ చేసి పంచి పెట్టారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి దర్శి నియోజక వర్గంలో చేసిన అబివృద్ధిని వివరించారు. మాజీ ఎంపీపీ గోళ్ల పాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎల్.జి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, మాజీ గుంటి గంగ దేవాలయ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, మాజీ ఎస్సీ సెల్అధ్యక్షుడు పూనూరి దేవదానం, సర్పంచిలు సుబ్బా రావు, మాజీ సర్పంచిలు వలసా రెడ్డి, రమణా రెడ్ది, ఎంపీటీసీలు అనపర్తి ప్రభుదాన్, యోహాన్ సోము అనిల్ రెడ్డి, గూడ గోపాల్ రెడ్డి, నంగు కొండా రెడ్ది, గుజ్జుల వెంకటేశ్వర రెడ్డి, గువ్వల శ్రీనివాస రెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

