శాకాహారం ఆరోగ్యానికి శ్రేయస్కరం …..సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.

బేగంపేట ఆగస్టు 15 జే ఎస్ డి ఎం న్యూస్ :
శాఖాహారం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని ప్యాట్నీ వద్ద ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ ఆధ్వర్యంలో శాఖా హారం పై అవగాహన ర్యాలీ ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ ఆహారాలు తిని అనారోగ్యానికి గురి కావద్దని అనేక పోషక విలువలు కలిగిన ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వలన పూర్తి ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, నిర్వాహకులు కృష్ణారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, నాగులు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *