ప్రకాశం జిల్లాలోని మరపగుంట్ల ఎస్సీ కాలనీ కిచెందిన బాలుడి తన తండ్రి మందలించగా అలిగి నివాసం వెళ్లి వెళ్లిపోయాడు. అతన డయల్ 100 కి ఫోన్ చేసి తన కుమారుడు నివాసం నుండి వెళ్లిపోయాడని తెలిపటంతో స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పిల్లవాడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు మరపగుంట్ల ఎస్సీకాలనీ కి చెందిన చండ్ర పాటి ఇస్మాయేల్ తన కుమారుడు 11 ఏళ్ల వయస్సు ఉన్న రామ్ కుమార్ ను మందలించాడు. దీంతో కనిపించకుండా పోవటంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు డయల్ 100 కు ఫోన్ చేస్తాడు. తక్షణమే స్పందించి వెలిగండ్ల ఎస్సై క్రిష్ణ పావని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచనల మేరకు సీఐ భీమా నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది తో కలసి గ్రామానికి వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్ సహకారంతో చెట్ల చాటున ఉన్న బాలుడిని కనుగొన్నారు. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించి కౌల్సిలింగ్ ఇచ్చారు. తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించిన జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిలకు కృతజ్ఞతలు తెలిపారు.
బాలుడిని గుర్తించటంలో అత్యంత ప్రతిభ కనపరచిన కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, పామూరు సీఐ భీమా నాయక్, వెలిగండ్ల ఎస్సై క్రిష్ణ పావని వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
