స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, రైతు బాంధవుడు , కార్మిక శ్రేయోభిలాషి స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న 116 వ జయంతి వేడుకలు శని వారం ఘనంగా నిర్వహించారు.
బిసి కార్పొరేషన్ కార్యాలయము లో
బిసి కార్పొరేషన్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు,
డిప్యూటీ డైరెక్టర్
జంపాణి రామచంద్రయ్య , స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ అంజయ్య లు సర్దార్ గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వల్లభభాయ్ పటేల్ తరువాత స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న గౌరవం పొందిన ఏకైక వ్యక్తి అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితభావంతో ఎన్నో ఉద్యమాలు నడిపిన మహోన్నత నేత సర్దార్ గౌతు లచ్చన్న అని, గౌతు లచ్చన్న కార్యదక్షత, ఉక్కు సంకల్పం వల్లే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎగిసిపడ్డ రాజకీయ కెరటమని, తాను నమ్మిన సిద్దాంతం కోసం పదవులను సైతం త్యాగం చేశారని పేర్కొన్నారు. తన రాజకీయ గురువు ఎన్ జి రంగా కోసం ఎంపీ పదవిని సైతం త్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమము నకు బిసి కార్పొరేషన్ సిబ్బంది మరియు బిసి వెల్ఫేర్ సిబ్బంది మరియు గౌడ ప్రజా నాయకులు అయిన జంపాణి రామచంద్రయ్య , స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ అంజయ్య, రాఘవులు, పి. చింతయ్య ప్రజా నాయకులు పాల్గొన్నారు.

