రైతుల సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందిటిడిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ,డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు అన్నారు.
అన్నదాత సుఖీభవ, సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ ట్రాక్టర్ ల ర్యాలీలో శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అందజేసి వారిలో ఆనందాన్ని కలిగించిన కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ ఈ ర్యాలీ జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అన్నదాత సుఖీభవ పథకంలో ఏడాదికి రూ. 20 వేలు రైతుకు ఎన్నికల హామీలలో సూపర్ సిక్స్ పథకాలలో ఒక పథకంగా హామీ ఇవ్వడం జరిగింద ని అన్నారు. ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేసే కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని మన దర్శి లో, తూర్పు వీరాయపాలెంలో, రైతుల మధ్యలో పచ్చని పంట పొలాలలో ఎలాంటి ఆర్భాటం లేకుండా ఈ పథకాన్ని రైతులకు అంకితం చేశారని, ఇక్కడ నుండే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నిధులు విడుదల చేశారని , దర్శి నియోజకవర్గంలో కూడా 45 వేల మందికి రెండున్నర కోట్ల రూపాయలు రైతుబంధు పథకం తొలి విడత ఒక్కొక్కరికి 7000 చొప్పున నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు.
రైతులకు ఎంతో సంతోషకరమైన పండుగ రోజు, ఈ పండుగ ప్రతి ఒక్కరికి తెలియాలని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ గా ఎలా అమలు చేస్తుందో ప్రజలందరూ తెలుసుకునే కార్యక్రమమే ఈ సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమం అని ఆమె వివరించారు.
పాలకులకు మంచి చేయాలన్న సంకల్పంతో, చేస్తున్న పాలనకు వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాడు, డ్యాములన్ని నీటితో నిండిపోయాయి, ఏడాది ఖరీఫ్ సీజన్ త్వరగా ప్రారంభమైందని..
రైతులుకు ఎంతో మేలు చేసే ఈ ఏడాది, వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందని ఆ దేవున్ని కోరుకుంటూ మనసారా మంచి జరగాలని ఆశిద్దాం అన్నారు.
రైతుల కోసం, రైతుల అభ్యున్నతి కోసం అధునాతన యంత్ర పరికరాలతో డ్రోన్ ల ద్వారా పొలాలకు మందులు పిచికారి చేసే యంత్రాలను సరఫరా చేశారు.
ఎరువులు, పురుగు మందులు విత్తనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని.A
మనది రైతు ప్రభుత్వం, రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను మనం చూసాం అని, రైతుల పెట్టుబడికి ఆసరాగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ నగదును ఇచ్చిన మాట ప్రకారం విడుదల చేయడం మన మంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమైందని తెలిపారు.
పొగాకు, మిర్చి, మామిడి, అపరాలు కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ మనందరికీ తెలుసునని అన్నారు.
దర్శికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు దర్శి ప్రాంతానికి కోల్డ్ స్టోరేజ్ కావాలని అడగగానే ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి రైతుల కోసం మరొకసారి కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా నిరూపించారని తెలిపారు.
అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎంతో కాలంగా ఎదురుచూస్తూ గత వైసిపి నిర్లక్ష్యంగా వదిలేసిన వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
వెలుగొండ వస్తే దర్శి నియోజకవర్గంలో దొనకొండ, కురిచేడు మండలాలు తాగునీటికి ఇబ్బందు లేకుండా ఉండే పరిస్థితి ఉందని అన్నారు. గత ఐదేళ్లు సాగర్ కాలవలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు
కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే దాదాపు కోటి రూపాయలతో కాలువల మరమ్మత్తులు చేపట్టారని రైతుల భూములకు నీరు అందించాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.
సూపర్ సిక్స్ లో మరొకటైన మహిళలకు వరమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నామని, దీపం పథకం అందజేశాంమని, తల్లికి వందనాన్ని ఇస్తున్నామని, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా పరిశ్రమను రాబట్టగలుగుతున్నామని, అమరావతిని పూర్తి చేసుకోగలుగుతున్నామని, పోలవరాన్ని తిరిగి ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇలా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని అన్నారు.
అదే స్ఫూర్తితో మన దర్శి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళదామని, రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం నేను మీలో ఒకరిగా రైతు బిడ్డగా మీ అందరి అభివృద్ధికి మీకు ఎప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తానని మాట ఇస్తున్నానని తెలిపారు.
తాళ్లూరు ప్రాంతంలో మొగిలిగుండం రిజర్వాయర్ ను పూర్తి చేసుకోగలుగుతున్నామని, లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించుకునేందుకు తాళ్లూరు, కురిచేడు లలో 30 కోట్లతో సబ్స్టేషన్ లను నిర్మించుకోగలుగుతున్నామని,
ఇలా అనేక మంచి కార్యక్రమాల ద్వారా రైతుల కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
కరువు లేకుండా, వలసలు లేకుండా దర్శి ప్రాంతంలోని దొనకొండ, కురిచేడు వంటి మండలాలలో పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానని. ఇందుకు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. గత వైసిపి నిర్లక్ష్యంగా వదిలేసిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ను త్వరలో ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము, సుమారు రూ.150 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని, దొనకొండలో సోలార్ పార్కు ప్రారంభం కాబోతోంది, దర్శిలో అమృత్ పథకం తో తాగునీటి సరఫరా పథకం, జలజీవన్ పథకం, ఇలా అనేక పథకాలు ముందుకు వెళుతున్నాయని అన్నారు.
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, డ్రైన్లకు 15 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు.
మరో ఐదు కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మత్తులు చేసుకోగలుగుతున్నామని, దర్శి నగరపాలక పంచాయతీగా ఉన్న దర్శిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకొని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, దర్శిలో మినీ స్టేడియం నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం, డిగ్రీ కాలేజీ నిర్మాణం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నామని చెప్పారు. ఇప్పటికే దాదాపు మూడు కోట్లతో పట్టణంలో రోడ్లు, డ్రైన్ లు, నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
మన అభివృద్ధి ప్రభుత్వంలో ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం నేను ఒక సైనికురాలు వలే పని చేస్తానని ప్రజలకు మాట ఇస్తున్నామని అన్నారు.
తదుపరినూతనంగా ఎన్నికైన దర్శి నియోజకవర్గం లోని పి ఎ సి ఎస్ చైర్మన్ లను సన్మానించారు.
ఈ కార్యక్రమం లోరైతు మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు,ఏంయంసి చైర్మన్ దారం నాగవేణి ,ఐదు మండల పార్టీ అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, పిడతల నేమిలయ్య, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, మహిళా నాయకురాలు శోభారాణి నూతనంగా ఎన్నికైన పి ఎ సి ఎస్ చైర్మన్ లు మరియు నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్నా కూటమి శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *