రైతులకు అందుబాటులో అన్ని రకాల ఎరువులు ఉన్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తాళ్లూరులో వెంకట రమణ ట్రేడర్స్ ను ఆయన తనిఖీ నిర్వహించారు. రికార్డులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని చెప్పారు. మండలంలో అన్ని రకాల ఎరువులు ప్రవేట్ డీలర్స్ వద్ద 552.375 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నదని తెలిపారు. రైతు కేంద్రాల ద్వారా 59 మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పటికే తెప్పించామని, మరలా ఇండేండ్ పెట్టామని చెప్పారు. రైతులకు ఎరువుల నరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
