తాళ్లూరు మండలంలోని కొర్రపాటి వారి పాలెం గ్రామానికి చెందిన రైతు యానం శ్రీను లివర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందాడు. అనంతరం దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి ను తన ఆనారోగ్య సమస్యను తెలిపటంతో ఆమె స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారు. దీంతో ఆయనకు రూ. 1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయినది. బాధితునికి సోమవారం ఆమె కార్యాలయంలో రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, నర్పచి కొర్రపాటి రామయ్య శ్రీదేవి, మాజీ ఎంపీటీసీ గాడిపర్తి లక్ష్మి నారాయణ , సైదావలి పాల్గొన్నారు.
