వ్యవసాయ మరియు దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల పురోగతిపై, తీసుకుంటున్న చర్యలపై సమీక్ష

ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో సరఫరా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వ్య‌వ‌సాయ‌ శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా,
వ్యవసాయ మరియు దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల పురోగతిపై, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో సరఫరా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధిరేటే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకొని అందుకనుగుణంగా లక్ష్య సాధనకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంచేలా తదనుగుణంగా అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యం మేరకు కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు మంజూరుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ పంట ను, ఏ ఏ ప్రాంతంలో ప్రోత్సహించవచ్చునో సమగ్రంగా పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నానో యూరియా వినియోగం పెరిగేలా రైతులను ప్రోత్సహించేలా క్షేత్ర స్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
తొలుత ఉద్యాన శాఖ ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్దికి మంచి అవకాశం ఉందని, అందుకనుగుణంగా ఉద్యాన శాఖ అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రోటెన్షియల్ ఏరియాను గుర్తించి ఉద్యాన పంటల అభివృద్ధి పై రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ప్రణాలికలు రూపొందించి అందుకనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పశుగ్రాసం పంపిణీ, పశు భీమా లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు జిల్లా లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కి చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబం రిజిస్టర్ అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారి సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ ఆర్ధిక సంవత్సరంలో 250 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్ చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించడమైనదని జిల్లా సెరికల్చర్ అధికారి, జిల్లా కల్లెకర్ కు వివరించారు. జిల్లా లో పట్టుపరిశ్రమ అభివృద్దికి చర్యలు చేపట్టడంతో పాటు నిర్దేశించిన లక్ష్యం సాధించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, సెరికల్చర్ అధికారులను ఆదేశించారు. జిల్లా లో సుక్ష్మ సేద్యం విధానాన్ని మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, పశుసంవర్ధక శాఖ జెడి రవి కుమార్, మత్స్య శాఖ జెడి శ్రీనివాస రావు, పకృతి వ్యవసాయ అధికారి సుభాషిని, మార్క్ఫెడ్ అధికారి హరికృష్ణ, జిల్లా సెరికల్చర్ అధికారి సుజయ్, ఎపిఎంఐపి పిడి శ్రీనివాస రావు, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల క్షేత్ర స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *