ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి సహకరించటం అభినందనీయం

ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి గ్రామస్తులు సహకరించటం అభినందనీయమని రజా నగరం ఎంపీయూపి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి మోహన్ గాంధీ అన్నారు. పాఠశాలలో గురువారం పాఠశాలకు అవసరమైన కంప్యూటర్ ను
గ్రామానికి చెందిన మేడగం హనుమంత రెడ్డి బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బి మోహన్ గాంధీ మాట్లాడుతూ గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల సహకారం ఉంటే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రూ. 40వేల విలువైన కంప్యూటర్ను బహుకరించిన దాత హనుమంత రెడ్డికి విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. దాతను ఘనంగా సత్కరించారు. ప్రాధమిక పాఠశాల హెచ్ఎం సీహెచ్ ఆశాజ్యోతి, ఉ పాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *