ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితోనే పంచాయితీల అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాయలయం సమావేశపు మందిరంలో శుక్రవారం పంచాయితీ అభివృద్ధి నూచికపై నర్పంచిలు, ఎంపీటీసీలు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ సానికొమ్ము నత్యం ఆధ్వర్యంలో నమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలలో కనిపించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలిజేయ్యాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ .. పంచాయితీలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ప్రజా ప్రతినిధులతో నమన్వయం గా ఉంచి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.

