వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఆదివారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు . ఈ సందర్భంగా ఆయనను పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు . అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్లు తెలిపారు . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ….. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేసినట్లు ముత్యాల నారాయణరెడ్డి తెలిపారు .
