పార్టీ నాయకులంతా ఐకమత్యంగా ఉంటూ, పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు. ఒంగోలు జిల్లా పార్లమెంట్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఒంగోలు నగరంలోని పి ఏ జి ఫంక్షన్ హల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఏవరికి ఇచ్చిన అందరం సమన్వయంతో కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయాన్ని మనందరం గౌరవిద్దామని జనార్దన్ కోరారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులుగా వచ్చిన గుమ్మడి సంధ్యారాణి,కర్నూల్ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు,రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, మంత్రి స్వామి, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
