అర్జీల పరిష్కారంపై సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో త్వరితగతిన పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో త్వరితగతిన పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, పార్ధసారధి, కుమార్, జాన్సన్ లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ప్రత్యేకంగా ఈ కార్యక్రమంపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆడిట్ టీమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆడిట్ లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. పరిష్కారంలో భాగంగా సరైన ఎండార్స్మెంట్ ఇచ్చారా లేదా ఆడిట్ టీం పరిశీలన చేయడం జరుగుతుందని, ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తున్నందున అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. ఆర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా అధికారులు శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఈపిటిఎస్ వెబ్ సైట్ లో ప్రతి రోజు అప్ లోడ్ చేయాలని, ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *