ముండ్లమూరు మండలంలోని శంకరాపురం గ్రామానికి చెందిన నంబూరి జ్యోతి తల్లిదండ్రులైన నంబూరి పెద్దరాగయ్య, తల్లి రవణమ్మ సహకారంతో డిగ్రీ పూర్తి చేసింది. భర్త పోలీస్ కానిస్టేబుల్ దాసరి ఏసుబాబు ప్రోత్సాహంతో కృషి పట్టుదలతో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ఒంగోలులోని సక్సెస్ కోచింగ్ సెంటర్లో డైరెక్టర్ వంశీ ఆధ్వర్యంలో గైడెన్స్ లో కోచింగ్ తీసుకొని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగం సాధించి ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. నంబూ రి జ్యోతిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.
