తాళ్లూరు మండలంలో అయ్యల పాలెంలో ఊరేగింపు వినాయక స్వామి విగ్రహం ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణ పడటంతో పలువురికి గాయాలైనాయి. స్వామి ఊరేగింపు సందర్భంగా కొంత మంది బాణా సంచా పేల్చు సమయంలో ప్రక్కకు వెళ్లి కాల్చుకోవాలని సూచించటంతో ఇరు పార్టీలకు చెందిన మద్దతు దారులు కర్రలతో కొట్టుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో వల్లభనేని వెంకట కిషోర్ బాబు తో పాటు మరికొంత మందికి, గవక కంట్ల రమణయ్య కు వారి కుమారిడికి గాయాలైనాయి. ఒంగోలు జీజీహెచ్ కి తరలించారు. ఘటనపై ఎస్సై మల్లిఖార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అయ్యల పాలెంలో ఊరేగింపులో ఇరువర్గాల ఘర్షణ – కేసు నమోదు
03
Sep