సమాజంలో ఉపాధ్యాయులగా, సమాజం పట్ల సేవా భావం కలిగి నేటికి కృషి చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత రిటైర్డు హెచ్ఎం ఎన్ అంజి రెడ్డిని గురుపూజోత్సవం సందర్భంగా మానవతా స్వచ్చంద సంస్థ శుక్రవారం ఘనంగా సన్మానించారు. దర్శిలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో మానవతా స్వచ్చంద సేవా సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అంజిరెడ్డి మాస్టర్ను ఘనంగా సన్మానించి వారి సేవలను వక్తలు కొనియాడారు. మండల విద్యాశాఖాధికారి కె రఘ రామయ్య, జిల్లా మానవతా సంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాస రెడ్డి, మానవతా సంస్థ అధ్యక్షులు బనవయ్య, చైర్మన్ దేవతా వర ప్రసాద్, జీహెచ్ హెడ్ మాస్టర్ షేక్ మస్తాన్, తిరపతి రెడ్డి, వెంకట రెడ్డి, జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
