తూర్పుగంగవరం గ్రామానికి చెందిన జన శిక్షణ సంస్థ బ్యూటిషియన్ నైపుణ్య నిపుణురాలు సునీత ను ఆమె వద్ద శిక్షణ పొందిన శిష్యురాల్లు శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం చేసారు. వృత్తి పరమైన నైపుణ్యంలో తమకు శిక్షణ ఇచ్చి స్వతహాగా తమ కాళ్లపై తాము బతుకుటకు దారి చూపిన నైపుణ్యనిపుణురాలు కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అందరూ శిక్షణ పొందిన విషయాలను మరింతగా పదును పెట్టి వృత్తిలో చక్కగా రాణించి ఆర్థిక వృద్ధి పొందాలని నైపుణ్య నిపుణురాలు సునీత అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
