పార్టీ కోసం కష్టపడిన వారికి వారికి గుర్తింపు ఇవ్వటంలో దర్శి నియోజక వర్గ టిడిపి
ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లకు సాటి ఎవ్వరూ లేరని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు కొనియాడారు. పార్టీ మాజీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డిని ఎపీ నాటక అకాడవమి కార్పోరేషన్ డైరెక్టర్గా నియమించటంతో వారు పార్టీ నాయకులతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, కడియాల రమేష్లను సాలువాలతో, గజమాలతో ఘనంగా సన్మానించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి రాబోవు రోజులలో మరింత ప్రాధాన్యత ఉంటుందన్న దాటిని ఇదే రుజువని ఎంపీపీ అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచెయ్యాల్సిన ఆవశ్యకతను, అందుకు డాక్టర్ గొట్టిపాటి, డాక్టర్ కడియాల అందిస్తున్న ప్రొత్సాహం మరువలేదని దన్నారు. అనంతరం బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పేద కాలేషా వలి, పాశం నూరిబాబు, నవులూరి విద్యా సాగర్, రాచకొండ వెంకట రావు, కైపు రామ కోటి రెడ్డి, వెలుగు సుబ్బా రావు, జాష్టి శ్రీను, నల్లపాటి నత్యం, ఎఎంసీ డైరెక్టర్ వలి, కళ్యాణ్ , తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు.
