తాళ్లూరు తో పాటు దర్శి, ముండ్లమూరు మండలాలను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగు సంఘ చైర్మన్, దర్శి నియోజక వర్గ నమన్వయ కర్త కైపు వెంకట క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కేంద్రం అయితే తాళ్లూరు నుండి 90 కి.మీల వరకు ఉంటుందని చెప్పారు. 35 కి.మీల దూరం నుండి 90 కి.మీల వరకు ఎలా వెళ్లాలని రైతులకు, సామాన్యులు తీవ్ర భారం అవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు ఆయా గ్రామాలలో సైతం నర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని పునః సమీక్షించాలని కోరారు. సంతకాల సేకరణలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు కూకట్ల వీర బ్రహ్మం, జిల్లా ఉపాధ్యక్షుడు గోరంట్ల కోటేశ్వరరావు, యూత్ కాంగ్రెన్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలేటి మహేష్, సుబ్బారెడ్డి, శ్రీనివాన్ తదితరులు పాల్గొన్నారు.

