ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎపీటీఎఫ్ ) ఎన్నికల కౌల్సిల్ సమావేశం సోమవారం తూర్పుగంగవరం ప్రాధమిక పాఠశాలలో నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా లేవీ ప్రసాద్, యోహాన్ రెడ్ది, పద్మావతులు వ్యవహరించారు. ఎపీటీఎఫ్ ఉపాధాయుల సంక్షేమం కోసం, విద్యా రంగ పరిరక్షణకు నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని వక్తలు అన్నారు. తాళ్లూరు మండలంలో సుదీర్ఘకాలం పనిచేసిన హనుమంత రావు, నాగేశ్వర రావు, అంజి రెడ్డి, శేషు లను ఘనంగా సన్మానించారు.
నూతనంగా మండల అధ్యక్షులుగా గండూరి నాగ రాజు, ప్రధాన కార్యదర్శి నారిపెద్ది శ్రీనివాస రావు లను ఎక గ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, రవి చంద్రా రెడ్డి, యాకోబు, అశోక్ చక్రవర్తి, ఖాజా వలి, చంద్రిక, శిరీషలు పాల్గొన్నారు.
