ప్రజల నుండి వచ్చే వివిధ రకాల సమస్యల యొక్క ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్ మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం ( పి జి ఆర్ ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారులతో పోలీస్ అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకుని ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
అందిన ఫిర్యాదుల గురించి సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఇలాంటి ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలను నిర్వహిస్తూ బాధితులకు త్వరిత న్యాయం అందించడం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, జాబ్ ఫ్రాడ్, కుంటుంబ సమస్యలు, చీటింగ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో డిటిసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

