దరిశి కోర్టుల పరిధిలో ‘పారా లీగల్ వాలంటీర్’గా కపురం శ్రీనివాసరెడ్డి నియామకం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్నీకోర్టుల పరిధిలలోని ఎంపిక కాబడిన 35 మంది పారా లీగల్ వాలంటీర్ల కు సోమవారం వరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. పారావాలంటీర్ల విధి విధానాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చాంబర్లో నిర్వహించారు. బాలకార్మికులను, వరకట్న బాధితులను,నిరుపేదలై, న్యాయ సహాయం అందని వారిని, బాల్య వివాహాలను, బాలనేరస్తులను అరికట్టడంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా బాధితులకు స్వచ్ఛందంగా న్యాయ సేవాధికార సంస్థకు పారాలీగల్ వాలీంటీర్లందరూ సహకరించాలని జిల్లా జడ్జీ షరీఫ్ శిక్షణలో కోరారు. దర్శి కోర్టు పరిధిలో పారా లీగల్ వాలంటీర్ గా కపురం శ్రీనివాస రెడ్డి నియమితులై శిక్షణ పొందారు.
ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…, ప్రకాశం జిల్లా ఐఆర్సీయస్(రెడ్ క్రాస్ సంస్థ)కు ఈసీ మెంబరుగా, ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థకు ప్రధాన కార్యదర్శిగా అనేక కార్యక్రమాలను నిస్వార్థంగా, ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా నిరుపేదలకు సేవజేస్తున్నామని, దీనిలో కూడా ఏలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిరుపేదలకు న్యాయ సహాయం అందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *