ప్రతి అధికారి తమ శాఖ పరిధిలోని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చెయ్యాలని జిల్లా పంచాయితీ అధికారి, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రావు కోరారు. మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో బుధవారం మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంచాయితీలలో పారిశుధ్యంపై ప్రత్యే శ్రర్థ తీసుకోవాలని సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా విషజ్వరాలు ప్రజలినట్లయితే సంబంధిత అధికారులు అప్రమత్తంగా లేకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వామిత్ర సర్వే మండలంలో వెనకంజలో ఉందని తగిన పురోగతి లేక పోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతలపై ప్రత్యేక శ్రర్థ వహించి ఎక్కడ నీరును అక్కడ ఇంకేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయశాఖలో ప్రస్తుతం ఎరువుల పరిస్థితి, ఇతర సాగు వివరాలు, పొగాకు సాగు నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను వ్యవసాయాధికారి వివరించారు. అధే విధంగా నానో యూరియా ప్రాముఖ్యతను కూడ రైతులకు తెలుపుతున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో గ్రామకార్యదర్శిలు అప్రమత్తతతో వ్యవహరించాలని ఎంపీడీఓ సానికొమ్ము నత్యం కోరారు. డిప్యూటీ ఎంపీడీఓ హనుమంత రావు, తహసీల్దార్ రమణా రావు, ఎపీఓ వెంకట రావు, ఎపీఎం దేవ రాజ్, ఎఈ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
