జీఎస్టి తగ్గింపుపై హర్షం తెలిపిన బిజేపి శ్రేణులు – సీఎం నరేంద్రమోదీకి పాలాభిషేకం

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం భవన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం జీ ఎస్ టి తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కి పాలాభిషేకం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సిగ్గం శ్రీనివాస రావు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. జీ ఎస్ టి తగ్గింపు ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమని ముఖ్య అతిథి జిల్లా ఇన్చార్జి మకుటం శివ శంకర్ అన్నారు. సాధారణ ప్రజల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అమర్ సింహా , అశోక్ రెడ్డి, జెవి నారాయణ, దండు శ్రీనివాస రావు, సతీష్, సాయి దామోదర్, ఆషా రావు, బెల్లంకొండ విజయలక్ష్మి లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *