బేగంపేట సెప్టెంబర్ 11(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పారడైస్ సి టి ఓ లోని కావేరీ సీడ్స్ వద్ద చత్తీస్ ఘడ్ రైతులు గురువారం నిరసనకు దిగారు.
కావేరి సీడ్స్ వేసి పంట నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఒక్కో ఎకరానికి 12000 చొప్పున మాత్రమే పెట్టుబడి సహాయం కింద ఇచ్చారని పేర్కొన్న రైతులు
ఒక్కో ఎకరానికి 50 వేల రూపాయలు చెల్లించి నష్టాన్ని పూడ్చాలని కోరారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఆరు నెలల పాటు కష్టపడి వ్యవసాయం చేసిన పంట మొత్తం నష్టపోవడంతో ఇబ్బందులుఎదుర్కొంటున్నారు . కావేరీ సీడ్స్ యాజమాన్యంతో చర్చించిన మీదట వారు త్వరలో ఈ సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
