బాలాజీ నగర్ డివిజన్ లో వరద కాలువ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవరం…

కూకట్ పల్లి సెప్టెంబర్ 11(జే ఎస్ డి ఎం న్యూస్) :
కూకట్ పల్లి నియోజక వర్గం పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ లో గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 60 లక్షల రూపాయలతో వరద కాలువ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కేసీఆర్ నాయకత్వంలో ప్రతినిత్యం ఏదో ఒక చోట అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తూనే ఉండేవారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కేటాయించిన నిధులను కూడా పక్కనపెట్టి పనులను పూర్తి చేయడం లేదని గత పది ఏళ్ల కాలంలో 90% పనులు పూర్తి చేసుకోబట్టి నియోజకవర్గంలో ఇప్పటికే పలు సిసి రోడ్లు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చెందిందని.. అతి త్వరలోనే పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు, మాజీ కార్పొరేటర్ బాబురావు డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్.బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *