తూర్పుగంగవరం పీహెచ్సీ ఆధ్వర్యంలో లక్కవరం
గ్రామంలో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందును అందించారు. దీర్ఘకాలిక వ్యాధులతో పాటు జ్వరాలు ఉంటే తక్షణమే పీహెచ్సీ సందర్శించాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఫ్రైడే డ్రై డే పాటించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, ఎంఎల్ హెచ్పీ వంశీ నాయక్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
