మొక్కల పెంపకంతో వాతావరణ సమతుల్యత సాధ్యమని టిడిపి జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్ అన్నారు. విఠలాపురం గ్రామంలో సోమవారం చంద్రన్న పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్, గురుతుల్యులు అచ్చేం నాయుడు ఆశీన్సులతో.. చంద్రన్న పచ్చదనం కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు పరిటాల సురేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, కాలనీ వాసులకు, రైతులకు మొక్కలను అందించి పెంచాలని సూచించారు. నవులూరి రామ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
