భారత్ సంచార్ నిగమ్ లిమిటెట్ (బి ఎస్ ఎన్ ఎల్)లో ప్రకటనలు ఫుల్ – సేవలు నిల్ – వినియోగదారులకు ఫైబర్ తీగ తెగిన, సెటాఫ్ బాక్స్ సమస్యలు వచ్చినా ఇంతే సంగతులు – మొర పెట్టుకుంటున్నా పట్టించుకోని బి ఎస్ ఎన్ ఎల్ సిబ్బంది -స్పందించని క్రిందస్థాయి అపరేటర్లు – సర్వీస్ ఇవ్వలేని వారు ఎందుకు కనెక్షన్ ఇచ్చారంటున్న వినియోగదారులు – ఇక వినియోగదారుల కోర్టును ఆశ్రయించటమే మేలంటున్న వినియోగదారులు

భారత్ సంచార నిగమ్ లిమిటెట్ సేవలపై ప్రకటనలు
ఫుల్ సేవలు నిల్ వలే ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో గతంలో పనిచేసిన దర్శి బిఎస్ ఎన్ ఎల్ ఇంజనీర్లు, సిబ్బంది ప్రచారం నిర్వహించి బి ఎస్ ఎన్ ఎల్ ఫైబర్ నెట్ సర్వీసులను పెంచారు. అయితే ఎదైనా చిన్న లోపం ఉన్నా సరే సరియైన సేవలు అందించ లేక పోవటంతో క్రమేపి సర్వీసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే దర్శి బిఎన్ ఎన్ ఎల్ ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా క్రింద స్థాయి సర్వీసు ప్రొవైడర్స్ లో సరియైన చలనం లేక పోవటంతో ఎదైనా ఫైబర్ నెట్ తీగలు తెగినా, సెటాఫ్ బాక్స్ లో లోపాలు ఉన్నా నెట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతన్నారు. గత నాలుగు రోజులుగా నెట్ సేవలు అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారు. విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేక పోవటంతో ఎమి చెయ్యాలో తెలియక సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఫైబర్ నెట్ తీగలను ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ఇక సేవలు సక్రమంగా అందక పోతే వినియోగదారులు ఫోరం ను ఆశ్రయించాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా సంబంధిక అధికారులు స్పందించి ఫైబర్ నెట్ సేవలు సక్రమంగా అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *