లోక కళ్యాణ మేళాను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం ఆవరణలో లోక కళ్యాణ మేళా ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లోక కళ్యాణం ఉపయోగించుకోవాలని కోరారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. మొదటి విడుతలో రూ.15వేలు రెండవ విడుత రూ. 25వేలు, మూడవ విడుత రూ. 50వేలు రూపాయలు రుణాలు తీసుకుని వారి వ్వాపార అభివృద్ధి చేసుకోవాలని కోరారు. మోప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆరోగ్య శిబిరాలు ఉపయోగించుకోవాలని, ఎఫ్ ఎస్ ఎస్ఐ సర్టిఫికేట్ ట్రైనింగ్ ఏర్పాటు చేయటం, ఆహార భద్రతకు సంబంధించిన శిక్షణ ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాపారులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించారు. బ్యాంక్ అధికారులచే రుణాలపై అవగాహన కల్పించారు. ఆహార పదార్ధాలు విక్రయించు వ్యాపారులకు ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ ద్వారా సర్టిఫికేట్ అందించారు. మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, సీఎంఎం డి సంతోష్ కుమార్, మోప్మా టీఈ కె రాణి తదితరులు పాల్గొన్నారు.


