ప్రతి పల్లె స్వచ్చ పల్లెగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పనిచేస్తునన్నారని ఆయన బాటలోనే దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ఆధ్వర్యంలో తాము పనిచేస్తున్నామని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తూర్పుగంగవరం పీహెచ్ సి పరిధిలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పీహెచ్ సివైద్యాధికారి డాక్టర్ మౌనిక అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంపీపీ తాటికొండ మాట్లాడుతూ ….ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహితగా ఉంచి స్వచ్ఛతకు సహకరించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యాంధే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎంకు తగిన చేయూత ఇవ్వాలని కోరారు. సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య, దర్శి నియోజక వర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మీరామోహినుద్దీన్ లు మాట్లాడుతూ.. స్వచ్చతకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే పర్యావరణ సమతుల్యత ఉంటుందని, క్యాన్సర్ వంటి వ్యాధులు దరి చేరవని అన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఐఓ చంద్రశేఖర్, పిహెచ్ఎన్ రమణమ్మ, హెచ్ వీ నుశీల సిబ్బంది పాల్గొన్నారు.


