ప్రతి ఒక్క మహిళ తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి టి ప్రవీణ్ కుమార్ అన్నారు. దారం వారి పాలెంలో శనివారం స్వర్త్ నారీ ససక్త పరివార్ లో బాగంగా ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యశిబిరాన్ని సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి, మన్నేపల్లి సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర)లు ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. వైధ్యాధికారి టి ప్రవీణ్ ఆధ్వర్యంలో 175 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఆయుర్వేదిక్ వైద్యుడు పి మల్లికార్జున రావు, నీ హెచ్ ఓ రమణ, హెల్త్ సూపర్ వైజర్ రవి కుమార్, పీహచ్ఎన్ విజయమ్మ, 104 సిబ్బంది, ఎం ఎల్ హెచ్ పి , ఆరోగ్య, ఆశ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీలు పౌష్టికాహా ప్రదర్శన నిర్వహించి పౌష్టికాహార ప్రాధాన్యత వివరించారు.
