ఖైదీలు జైలును శిక్షణాలయంగా భావించాలని జిల్లా జడ్జి ఏ.భారతీదేవి సూచించారు. స్థానిక సబ్ జైల్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శివశంకర్ రెడ్డి
తో కలిసి శనివారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. సబైజైలులో సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. జిల్లా జడ్జి భారతీదేవి మాట్లాడుతూ… జైలుకు వచ్చిన ఖైదీలు తమ తప్పు లను మననం చేసుకుని మళ్లీ తప్పులు జరగకుండా చూసు కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దయాగుణం కలిగి ఉండాలని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్, సీనియర్ సివిల్ జడ్జి శివశంకర్ డ్డిలు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని
చెప్పారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి కోటేశ్వరరావు, న్యాయవాదులు ఆది నారాయణ, సురేష్, మనోహరమ్మ, పారాలీగల్ వాలంటీరు మరియు ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి తదితరులు
పాల్గొన్నారు.

