గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం -రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత -టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహణ – ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,ఇతర ప్రజా ప్రతినిధులు

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆదివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలోరాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,ఇతర ప్రజా ప్రతినిధులతోకలిసి ఆమె పాల్గొన్నారు.
ముందుగా నాయుడుపాలెం గ్రామ ప్రవేశ మార్గంలో ఉన్న భారత రత్న బి.ఆర్.అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు వీరు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. రూ.2 కోట్లతో చేపట్టే ఎస్సీ కాలనీలోని అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మంత్రి అనిత శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడ శిలాఫలకాన్ని కూడా ఆమె ఆవిష్కరించారు. తదుపరి గ్రామంలో రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కే.వీ. విద్యుత్తు ఉప కేంద్రాన్ని కూడా ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరమని అన్నారు. అందుకే వీటి నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉప కేంద్రాన్ని ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన 50 సెంట్ల విస్తీర్ణంలో ఈ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రం వలన తూర్పు నాయుడుపాలెం, శివాపురం, మల్లవరప్పాడు, సూరారెడ్డిపాలెం, కారుమంచి, వల్లూరు, వసపల్లిపాడు గ్రామాలలో లోవోల్టేజీ సమస్యను నివారించవచ్చు అన్నారు. ప్రజలపై అదనపు భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు మంత్రి రవి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు, గిద్దలూరు, చీరాల ఎమ్మెల్యే లు , దామచర్ల జనార్ధన రావు, ముత్తుమల అశోక్ రెడ్డి, ఎం.ఎం.కొండయ్య,
కందుకూరు,పర్చూరుఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఏలూరు సాంబశివరావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ. గూడూరి ఎరిక్సన్ బాబు, దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఇతర ప్రముఖులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మర్లపాడు గ్రామంలో నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *