నాగంబొట్ల పాలెం, రామ భద్రాపురం పంచాయితీలలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ నిర్వహణ

తాళ్లూరు మండలంలోని నాగంబొట్ల పాలెం,రామ భద్రాపురం
పంచాయితీ ల పరిధిలో మంగళవారం వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, సర్పంచిలు చిమటా సుబ్బా రావు, బాపిరెడ్డి వెంకటలక్ష్మి నాగిరెడ్డి, గ్రామ నాయకులు వంకాయల బాల నాగి రెడ్డి, కొమ్మి రెడ్డి రాజా, పసుపులేటి కోటయ్య, సోము నరసింహా రెడ్డి దర్శి నియోజక వర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు యత్తపు మధుసూధన రెడ్డి, నియోజక వర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జక్కుల రామక్రిష్ణ, మల్కాపురం, వెలుగు వారి పాలెం సర్పంచిలు వలి, కోటేశ్వర రమ్మ, ఎంపీటీసీ, ఎస్సీ, మైనార్టీ సెల్ ల అధ్యక్షులు యామర్తి ప్రభుదాస్, షేక్ లతీఫ్ (బచ్చ ), గుంటి గంగా భవాని ఆలయ మాజీ ట్రస్ట్ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, గోపు శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *