సీబీజీ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలి -జిల్లా కలెక్టర్ రాజా బాబు

ప్రకాశం జిల్లా, పిసి పల్లి మండలం, దివాకరపురం గ్రామం వద్ద నిర్మించనున్న సీబీజీ ప్లాంట్ ప్రదేశాన్ని గురువారం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలిసి సందర్శించి, ప్లాంట్ ప్రతినిధులతో సమావేశమై ప్లాంట్ నిర్మాణ పురోగతిపై వివరాలను అడిగితెలుసుకున్నారు. ప్లాంట్ నిర్మాణ పురోగతి, ప్లాంట్ కు కేటాయించిన భూముల వివరాలను ప్లాంట్ స్టేట్ హెడ్ టి. బాబు, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇప్పటి వరకు ప్లాంటు కు కేటాయించిన భూములలో సాగుకు ఎంత భూమి ఉపయోగపడుతుంది, ఎంత భూమి ఉపయోగ పడదో సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ప్లాంట్ ప్రతినిధులకు సూచించారు. ప్లాంట్ 30 కిలో మీటర్ల రేడియస్ లో ఎంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నదో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, అధికారులకు సూచించారు. ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, ప్లాంట్ ప్రతినిధులకు సూచించారు.
కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, ప్లాంట్ సివిల్ హెడ్ వెంకటరావు, మండల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *