ప్రముఖ నేపధ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు,టెలివిజన్ వ్యాఖ్యాత, అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్ధంతిని దరిశిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో, ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఐఆర్సీయస్ ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోళ్ళపాటి సుధారాణి అచ్చయ్య , భవిత కేంద్ర నిర్వాహకులు సుబ్రమణ్యం, దళిత సంఘ నాయకులు గర్నెపూడి ప్రేమ్ కుమార్, గాయకులు రాచపూడి మోషే, మహిళలు పాల్గొని ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర పటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం(ఎస్పీ బాలసుబ్రమణ్యం)గాయకునిగా,సంగీత దర్శకుడిగా,నటుడిగా,టెలివిజన్ వ్యాఖ్యాతగా భారత దేశ ప్రజలందరికీ సుపరిచితులుగావుండి,తన గానామృతంతో యావత్ భారతదేశాన్నే ఉర్రూతలూగించి,ఒక నటుడగాగూడా ఎంతోమంది అభిమానులను సొతం చేసుకున్నారని,ఆయన లేనిలోటు ఎవరూ తీర్చలేరని అన్నారు. అంతేగాకుండా తెలుగు,తమిళం,కన్నడ,హిందీ భాషలలో విభిన్న రీతుల్లో 40 వేలకుపైగా పాటలు పాడి, దేశ చిత్రపరిశ్రమలో అరుదైన రికార్డును సొంతం చేసుకుని, 2001లో పద్మశ్రీ,2011లో పద్మభూషణ్,వివిధ విభాగాలలో 25 నంది అవార్డులు,మరణానంతరం 2021లో కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు సొంతంచేసికొని, మరణించినా, ప్రతి నిత్యమూ ప్రజల హృదయాలలో మెదలుతూ ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పటికీ చిరస్మరనీయుడని, ఈనాటి యువ గాయనీ గాయకులకు ఒక మంచి మార్గదర్శకుడని, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని, కపురం ఎస్పీ బాలు ని కొనియాడారు.

