తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు టంగుటూరు లో 26వ తేదీని జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా సబ్ జూనియర్ అండర్ –14 క్యాటగిరిలో సాఫ్ట్ బాల్ గేమ్ కి సంబంధించిన విభాగంలో హైస్కూల్ విద్యార్థులు సిరిగిరి రవితేజ మరియు చాట్ల జగదీష్ లో ఎంపిక ఆవ్వడం జరిగింది వీరి ఇరువురు వచ్చే నెలలో 4 తేదీ నుండి 6 వరకు విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైయస్సార్ కే ప్రసాద్ , పాఠశాల పిడి శివ నాగరాజు తెలియజేశారు. ఎంపిక అయిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు .
