డ్వామా ఆద్వర్యంలో ప్రతి గ్రామంలో హర్టికల్చర్ పెంపకం, ఇంకుడు గుంత నిర్మా ణం, మొక్కల పెంపకం పై ఫీల్ట్ అసిస్టెంట్లు ప్రత్యేకశ్రద్ద చూపాలని డ్వామా పీడీ జి.జోసఫ్ కుమార్ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఎం పీడీవో పి. అజిత అధ్యక్షతన ఉపాధి హామీ సిబ్బందితో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ తాళ్లూరు ప్రాంతంలో నీరు పుష్కలంగా వుండి అధికమొతాదులో వరి పంట సాగుచేస్తూ రైతాంగం నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం డ్వామా పధకం కింద హర్టికల్చర్ ను ప్రోత్సహిస్తూ నిధులుసమకూరుస్తున్నందున రైతులు వరికి బదులు ఉద్యానవన పంటల పెంపకం చేపట్టేలాచూడాలన్నారు. మండలంలో 160 ఎకరాలల్లో ఉద్యాన వన పంటల పెంపకం మంజూరు చేస్తే నేటికి 10 ఎకరాల్లో కూడా పండ్లతోటల పెంపకం చేసేందుకు రైతాంగంముందుకు రాకపోవటం ఫీల్ట్ అసిస్టెంట్ల నిర్యక్ష్యంగా వున్నారని అర్థమవుతుందన్నారు. రైతాంగంతో మమేకమై పండ్లతోటల పెంపకం వల్ల జరిగే లాబాలను వివరించి వారికి అవగాహన కల్గించాలన్నారు. వారంరోజుల్లో50శాతంఎకరాల్లో ఉద్యాన వనపంటలు సాగు చేసేలా చూడాలన్నారు. గ్రామాల్లో డ్వామా పధకంద్వారా ఇంకుడు గుంతలు మంజూరు చేస్తున్నందున త్వరిత గతిన నిర్మాణాలు జరిగేలా చూడాల న్నారు. గ్రామాల్లో మురుగు కాల్వల నుండి నీరు దిగువకు వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవులున్నారని, గ్రామ కార్యదర్శులను సంప్రదించి కమ్యూటీ ఇంకుడు గుంతలు నిర్మాంచుకునేలా చూడా లన్నారు. దీనివల్ల గ్రామాల్లో మురుగు నీటి సమస్య తొలుగుతుందన్నారు. మండలంలో ఒక గ్రామం లో పల్లె పుష్కరణి కింద చెరువు నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేయనున్నట్లు తెలి పారు. అందుకు డ్వామా నుండి, పంచాయతీ, మండలపరిషత్, ప్రజా ప్రతి నిధులసహకారంతో నిధులు సమకూర్చి ప్రజలకు ఉపయోగంలో వుండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని ఒక గ్రామంలో ఒక గ్రామసమీ పాన 2000 వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను గ్రామంలో ఉత్సాహ వంతులకు అప్పగించనున్నట్లు తెలిపారు. మొక్కలు పెరగటం వల్ల వాతా వరణం సమతుల్యంగా వుండటంతో ఆగ్రామ పరిసరాలు చల్లని ప్రాంతంగా వుండి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వుంటాయన్నారు.
పురోగతి లేకుండా ఉత్సవిగ్రాహాలుగా వుంటే ఫీల్డ్ అసిస్టెంటలపై చర్యలు తప్పవు….పీడీ హెచ్చరిక
గ్రామాల్లోఉపాధిహామీ పథకం కింద చేపట్టాల్సిన పలు పథకాల అమలు జీ రో స్థానంలో ఉండటంతో ఫీల్డ్ అసిస్టెంట్ ల పై
పీడీ జోసఫ్ కుమార్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. హర్టికల్చర్ పెంపకం, ఇంకుడు గుంత నిర్మాణాలపై పురోగతి లేక పోవటంతో ఆగ్రహించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవో అజితను ఆదేశించారు. ప్రభుత్వలక్ష్యాలను అమలు చేయటంతో నిర్లక్ష్యం వహిస్తున్న ఫీల్అసిస్టెంట్లు అవసరం లేదన్నారు. డ్వామాద్వారా జరుగుతున్నప్రభుత్వ పథకాలపై అవగాహన కల్గించి ప్రజల జీవనోపసాదులను అభివృద్ధి చేయకుండా వ్యక్తిగతంగా అభివృద్ది చెందాలను కుంటే కుదరదన్నారు.వారం రోజుల్లో అన్ని రంగాల్లో పురోగతి సాధిం చాలని లేకుంటే వారిని తొలగించి కొత్తవారిని నియమించటం జరుగుతుందని తెలి పారు. ఈసమావేశంలో ఎంపీడీవో పి.అజిత, ఏపీవో వెంకటేశ్వర్లు, ఈసీ శ్రీనివాసరె డ్డి, టీఏలు, ఫీల్అసిస్టెంట్లు, సీవోలు పాల్గొన్నారు.
