భారతీయ పండుగలన్నీ చెడుపై మంచి సాధించిన విజయాలకు గుర్తుగా జరుపుకుంటారని, ఆనందం సంతోషం కుటుంబ సభ్యులతో సమాజంలోని తోటి ప్రజలతో పంచుకోవడానికి ఒక ముఖ్య వేదికగా పండుగలను నిర్వహించుకోవడం జరుగుతుందని ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వారు మాట్లాడుచు మోదీ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో, ఎంతో భద్రంగా జీవిస్తున్నారని, మొన్నటి పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ పై సాధించిన విజయంలో మన రక్షణ వ్యవస్థ ఎంత బలీయమైనదో ప్రపంచానికి అవగతమైనదని. ప్రశాంత చిత్తం తో ఉండే మోదీ దేశ రక్షణ, ప్రజల ఆర్థిక మెరుగుపరచడానికి ఏం చేయాలి అని నిరంతరం తలపోస్తుంటారని, గతంలో పాలకులు చేసిన అనాలోచిత చట్టాలను రూపుమాపడానికి నిరంతరం ఒక్క సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారని, ప్రస్తుతం ప్రజలందరూ దసరా పండుగను పది రోజుల ముందుగానే సెప్టెంబర్ 22నే జరుపుకున్నారని, దానికి కారణం దాదాపు 147 నిత్యవసర సరుకులపై జీఎస్టీ ని తగ్గించారని మరికొన్ని ప్రాణాంతక వ్యాధుల మందులపై ఉన్న జీఎస్టీ ని పూర్తిగా తొలగించారని వివరించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా పఖ్వాడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు పరిశుభ్రత డ్రైవ్లు, ఆరోగ్యం మరియు రక్తదాన శిబిరాలు, చెట్ల పెంపకం, యువత మారథాన్లు, ప్రదర్శనలు మరియు స్థానిక ఉత్పత్తుల ప్రచారం వంటి కార్యకలాపాలతో నిర్వహిస్తున్నారని, మహిళల ఆరోగ్యం, పర్యావరణం మరియు స్వావలంబనపై అవగాహన కల్పిస్తూ సేవల ను గుర్తించడం మరియు దేశ నిర్మాణ చొరవలను గుర్తించడం చేసుకున్నారని, యువత శక్తి సామర్థ్యాలను వెలికి తీసే విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని బిజెపి ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామానాయుడు తెలిపారు.
