బీసీ లు రాజ్యాధికార సాధనకు నడుం బిగించాలి…..తెలంగాణా రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్.

హైదరాబాద్ సెప్టెంబర్ 28(జే ఎస్ డి ఎం న్యూస్):
బీసీలు రాజ్యాధికార సాధన పోరాటానికి నడుం బిగించాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు.ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిసి ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు రచించిన హిస్సా ఇజ్జత్ హుకుమత్ బీసీ రాజ్యాధికార సిద్ధాంతం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజకీయ ఆర్థిక రంగంలో బీసీలు అణిచివేత గురవుతున్నారని వివరాలను గణంకాలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారని ఆయన తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి మాట్లాడుతూ బీసీలు చైతన్యం తెచ్చుకోని అధికారం కోసం, హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలలో కులంతో పాటు డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేయాలని ఆర్థిక రంగంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. మాజీ పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగ రచన సమయంలో నుంచి ఇప్పటివరకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ డా,,బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు ఉన్న విధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల చాలా నష్టపోయామని పేర్కొన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య మాట్లాడుతూ బీసీలు రాజ్యాంగపరమైన పరిజ్ఞానం పెంచుకొని చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటాలు చేయాలని సూచించారు. వకులాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ నేటి తరానికి ఈ పుస్తకం మార్గదర్శకం చేస్తుందని చెప్పారు. జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ ఈ పుస్తకం రాజ్యాధికారానికి ఆయుధాలుగా మారుతుందని పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు మాట్లాడుతూ తాను ఎంతో అధ్యయనం చేసి ఈ పుస్తకం రాయడం జరిగిందని బిసిలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు, బిసి పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ ,ప్రముఖ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, చామకూర రాజు, అయిలి వెంకన్న గౌడ్ కె.వి గౌడ్, గుజ్జ సత్యం, ఎర్రమాద వెంకన్న, దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్ ,చెన్న శ్రీకాంత్, కర్నాటి మనోహర్, బొమ్మ రఘురాం నేత, లింగేష్ యాదవ్ నకిరెకంటి శ్రీనివాస్, కొండల్ గౌడ్, ఒంటెద్దు నరేందర్, కిరణ్ కుమార్, వసుమతి యాదవ్, గౌలికరు సోనీ, దాసు సురేష్, బైరు శేఖర్, అవ్వారు వేణు, కర్నాటి వెంకటేశం, పెద్ధి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *