చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు…ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట సెప్టెంబర్ 28(జే ఎస్ డి ఎం న్యూస్) :
చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేవీ శరన్నవరాత్రులు, విజయదశమి జరుపుకుంటామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేవీ నవరాత్రులలో భాగంగా ఆదివారం ఆయన పలు దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*సనత్ నగర్* లో…

సనత్ నగర్ డివిజన్ లోని సెవెన్ టెంపుల్స్ ను దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, ఆలయ ఈ ఓ సత్యనారాయణ, డివిజన్ బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, శేఖర్, రాజేష్, భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

*అమీర్ పేట* లో….

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్ పేట డివిజన్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, కనకదుర్గమ్మ ఆలయం, గణేష్ ఆలయాలను దర్శించుకున్నారు. బల్కంపేట ఆలయం వద్ద ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎల్లమ్మ అమ్మవారిని నవరాత్రుల మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే ను ఆలయ ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఆయా దేవాలయాల వద్ద పూజల అనంతరం ఎమ్మెల్యే ను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆయా ఆలయాల EO లు శేఖర్, అంబుజ, నరేందర్ రెడ్డి, బల్కంపేట ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, కూతురు నర్సింహ, బలరాం, వేణు, బాబా గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

*బేగంపేట* లో…..

దేవీ నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట లోని కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే ను సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, నరేందర్, శేఖర్, నాగరాజు, ఆరీఫ్, ఆలయ నిర్వాహకులు సుభాష్ తదితరులు ఉన్నారు.

*రాంగోపాల్ పేట* లో….

రాంగోపాల్ పేట డివిజన్ లోని ప్రముఖ దేవాలయం శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నవరాత్రుల మండపాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న చండీహోమం లో పాల్గొన్నారు. తదనంతరం మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, ఆలయ ఈ. ఓ మనోహర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ  డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు నాగులు, గణేష్, రాంమోహన్ యాదవ్, సతీష్, అనురాగ్, మహేందర్, చంద్రప్రకాష్ తదితరులు ఉన్నారు.

*బన్సీలాల్ పేట* లో….

బన్సీలాల్ పేట లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద గల ఆటోస్టాండ్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మెట్లబావి సమీపంలో గల ఎర్ర పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం బండ మైసమ్మ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం లో గల అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పద్మారావు నగర్ లోని పోల్ బాల్ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుని పూజలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ప్రేమ్ కుమార్, అంబులెన్స్ సురేష్, మహేందర్ గౌడ్, కొత్తూరు వెంకట్, జనార్దన్, రంజిత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *