హైదరాబాద్ సెప్టెంబర్ 29(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన యానిమేషన్ పాత్ర చోటా భీమ్ ఆధారంగా రూపొందించిన తొలి థీమ్ కేఫ్ నగరంలో ప్రారంభం కానుంది. ప్రముఖ యానిమేషన్ సంస్థ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ఈ బిజీ గ్రూపుతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. చోట బీమ్ థీమ్ కేఫెలో కథలు చెప్పడం ఆటలు, ఆహారం , లైసెన్సుడ్ మర్చండై తో పాటు వినోదాన్ని పంచేలా ఎన్నో అంశాలు ఈ థీమ్ కెఫెలో కలిసి ఉంటాయి. సోమవారం బేగంపేటలోని తాజువాక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈవో వ్యవస్థాపకుడు రాజీవ్, చిలక ఈ బీసీ గ్రూపు సహా వ్యవస్థాపకుడు హరి కిరణ్ లు ఈ విషయాన్ని వెల్లడించారు. చోట బీమ్ చోటికి మైటీ రాజు పాత్రలతో ఇంటర్ ఆక్టివ్ ప్లేస్ జోన్లతో థీమ్ కెఫెలు ఉంటాయన్నారు. కథ కోణాలు లైసెన్స్ వస్తువులు వినోదాత్మక కార్యకలాపాలు పిల్లలకు అత్యంత సురక్షితమైన వాతావరణం తల్లిదండ్రులకు నమ్మకమైన స్థలం కుటుంబ సమేతంగా పండుగలా గడిపే వేదికగా ఈ థీమ్ కెఫెలను డిజైన్ చేసినట్లు వారు చెప్పారు. గత 17 ఏళ్లలో యానిమేషన్ పాత్ర మాత్రమే కాకుండా పిల్లలు కుటుంబాలు అభిమానించే సాంస్కృతిగా దృగ్వీశయంగా మారిందన్నారు. ఇప్పుడు థీమ్ కెఫె ద్వారా నిజ జీవిత అనుభవం అందించాలనుకుంటున్నామని వారు స్పష్టం చేశారు. వినియోగదారులకు మధురమైన అనుభూతులను అందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించినట్లు వారు వెల్లడించారు హైటెక్ సిటీలో 2025 డిసెంబర్ నాటికి పైలెట్ ప్రాజెక్టుగా రెండు అవుట్ లేట్లను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. 20 26 నాటికి 50 అవుట్లెట్లు అనంతరం 300 కెఫెలను దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
