జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారి పై కేసులు నమోదు చేయడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ప్రదేశాలను శుభ్రం చేయడం జరిగింది.
సెప్టంబర్ నెలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 1034 మంది పై కేసు నమోదు చేయడం జరిగింది.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిన అడ్డకట్టవేయడం వల్లన రోడ్డు మీద అకతాయిల అల్లర్లు తగ్గుముఖం పడతాయి.
అంతేకాకుండా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 293 ప్రదేశాలను గుర్తించి 265 ప్రదేశాలను శుభ్రం చేయడం జరిగింది.
గుడి పక్కన, బడి పక్కన గుబురుగా ఉన్న ప్రదేశాలను గుర్తించి స్ధానికుల సహకారం తో పోలీసు సిబ్బంది అ ప్రదేశాలను శుభ్రం చేయటం జరుగుతుంది.
పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్లన అసాంఘిక కార్యక్రమాలు అడ్డు కట్టవేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
ప్రజలు కూడా పోలీసు వారికి తమ వంతు సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేయడమైనది.
మీ కళ్ల ముందు ఎవరైనా మద్యం సేవించి ఇబ్బందులు పెడుతుంటే వేంటనే స్పందించి స్ధానిక పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని మనవి చేయడమైనది.
లేని పక్షంలో మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లో విడియో తీసి పోలీసు వారి వాట్సాప్ నెంబర్ 9121102266 కు కాని, డయల్ 112 కాని ఫోన్ చేయవలసినదిగా తెలియజేయాల్సినదిగా కోరడమైనది.
పోలీసు నిబంధనలను ఎవరు ఉల్లంఘించిన అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయని మనవి చేయడమైనది.
ప్రజలు ఇచ్చే సమాచారాన్ని చాలా గోప్యంగా ఉంచుతామని తెలియజేయటమైనది.


