దత్తన్న తెలుగు రాష్ట్రాలే కాదు,దేశ రాజకీయాల్లోనే అజాత శత్రువు – రాజకీయాలకు అతీతంగా చాలా మందికి ఆయనంటే అభిమానం – అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా అందరిని ఒక వేదిక మీదకు తేవడం దత్తాత్రేయ గారికే సాధ్యం – వారికి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ అక్టోబర్ 3(జే ఎస్ డి ఎం న్యూస్) :
దత్తన్న తెలుగు రాష్ట్రాలే కాదు,దేశ రాజకీయాల్లోనే అజాత శత్రువనీ మాజీ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు.
రాజకీయాలకు అతీతంగా చాలా మందికి ఆయనంటే ప్రత్యేక అభిమానమని పేర్కొన్నారు.దసరా అనంతరం నిర్వహిస్తున్న
ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రముఖుల తరలి వచ్చారని అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా అందరిని ఒక వేదిక మీదకు తేవడం దత్తాత్రేయ కే సాధ్యమని,వారు సమాజ ఐక్యత కోసం చేస్తున్న కృషి స్పూర్తి దాయకమన్నారు. బండారు దత్తాత్రేయ కు ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ సీ.జె ఎన్వీ రమణ,సినీనటుడు అక్కినేని నాగార్జున,ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ
మాదిగ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *