జీఎస్ టి వాహన రాయితీలతో వాహనాలు మరింత చౌక – ఎంవీఐ రవి కుమార్ – సూపర్ జీ ఎస్ టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జెఎస్ టి రాయితీలతో వాహనాలు మరింత తగ్గింపు ధరలకు అందుతాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) రవి కుమార్ అన్నారు. దర్శి ఎంవీఐ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం సూపర్ జీ ఎస్ టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చియ్య జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీ ఎన్ టి ఎస్. టి. ఓ సుధాకర్ రావు మాట్లాడుతూ…. చిన్న వాహనాలు ఆటో రిక్షా, మోటార్ కార్స్, క్యాబ్స్, లారీలు, బస్సులు, ట్రాక్టర్స్ కు 28శాతం నుండి 18శాతం వరకు తగ్గుట, 12శాతం నుండి 5శాతం వరకు రాయితీ వస్తుందని అన్నారు. రూ.9.8 లక్షల వరకు ఉన్న మిని ట్రక్లకు దాదాపు 2.75 లక్షల జీఎన్టి నేడు 18శాతం తగ్గి 1.4 లక్షల పన్ను తగ్గిందని తెలిపారు. దీని వలన చిన్న వాహనదారులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. వికాస్ విశ్వాస్ -నమ్మకమైన అభివృద్ధి అనే నినాదంతో వాహనాలపై జీఎస్టి తగ్గుదలను తెలియజేస్తూ చిన్న వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది కిరణ్, హెబీ వెంకా రెడ్డి, డీలర్స్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *