ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను పీపీపీ పద్దతి లో ప్రవేటు కి కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో సేకరించి గవర్నర్ కి అందించే కార్యక్రమం చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి మండలం కొత్త రెడ్డి పాలెం గ్రామంలో గురువారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భముగా వైసిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు , దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రం లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా వున్నప్పుడు 17 మెడికల్ కాలేజీ లు నిర్మాణం చేపట్టి 5 కాలేజీ లు నిర్మాణం పూర్తి చేసి ఆసుపత్రులను లను కూడా ప్రారంభించడం జరిగినదని అన్నారు. చంద్రబాబు 15 సంవత్సరాలు అధికారం లో ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ అయిన కట్టారా అని ప్రశ్నించారు. పేద విద్యార్ధులకు మెడికల్ విద్యను దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అన్నారు. పేద బడుగు బాలహీన వర్గాల ప్రజలకు వైద్యం అందించాలి అని వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతూ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు అని అన్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రవేటు పరం అయితే పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగా మారుతుంది అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకాశం జిల్లా లో రిమ్స్ మెడికల్ కాలేజీ నిర్మించి ఎంతో మంది పేద విద్యార్ధులకు వైద్య విద్య అందించడమే కాకుండా ప్రజలకు వైద్యం అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 104,108 పథకాలు మెరుగైనవిగా తయారు చేశారని అన్నారు.ఆరోగ్య శ్రీ మరియు ఆరోగ్య రక్ష వంటి పథకాలతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచారని అన్నారు.కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగే కోటి సంతకాల సేకరణ లో దర్శి నియోజకవర్గం లో 60 వేల సంతకాలు సేకరించి గవర్నర్ కు పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,రాష్ట్ర కార్యదర్శి బోట్ల రామారావు ,దర్శి, దొనకొండ ,తాళ్లూరు, కురిచేడు, మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకట రెడ్డి, కాకర్ల కృష్ణా రెడ్డి , టి. వి సుబ్బారెడ్డి , సుబ్బయ్య యాదవ్ , దొనకొండ ఎంపీపీ ఉషా మురళీ,కురిచేడు జడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి , దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి , జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవప్రసాద్ ,జిల్లా యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ,జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కొల్లా భాస్కర్ ,రాష్ట్ర మహిళా కార్యదర్శి జయంతి , జిల్లా ఉపాధ్యక్షులు కె.వి.రెడ్డి ,మాజీ ఎంపీపీ లు వీరగంధం కోటయ్య గారు, గోళ్ళ పాటి మోషే , దేవదానం , కౌన్సిలర్లు ఆవుల జ్యోతి, మేడగం మోహన్ రెడ్డి, బాబు రావు,రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి సైదా ,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కేసరి రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






