కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జెఎస్ టి రాయితీలను వాహనదారులు ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ ఆర్ సుశీల అన్నారు. ఒంగోలు లో రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం సూపర్ జీ ఎస్ టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ ఆర్ సుశీల మాట్లాడుతూ చిన్న వాహనాలు ఆటో రిక్షా, మోటార్ కార్స్, క్యాబ్స్, లారీలు, బస్సులు, ట్రాక్టర్స్ కు 28శాతం నుండి 18శాతం వరకు తగ్గుట, 12శాతం నుండి 5 శాతం వరకు రాయితీ వస్తుందని అన్నారు. రూ. 9.8 లక్షల వరకు ఉన్న మిని ట్రక్ కు
దాదాపు 2.75 లక్షల జీఎస్ టి నేడు 18శాతం తగ్గి 1.4 లక్షల పన్ను తగ్గిందని తెలిపారు. దీని వలన చిన్న వాహనదారులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. వికాస్ విశ్వాస్ – నమ్మకమైన అభివృద్ధి …అనే నినాదంతో వాహనాలపై జీఎస్ టి తగ్గుదలను తెలియజేస్తూ చిన్న వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మేయర్ గంగాడ సుజాత, అర్డీఓ కళావతి, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ డి సత్యప్రకాశ్, మోటార్ వాహన తనిఖీ అధికారులు, కార్యాలయ సిబ్బంది, డీలర్స్ పాల్గొన్నారు.


